టిడిపితోపొత్తు నిర్ణయం జిల్లా కమిటీలదే: బిజెపి
ఆదిలాబాద్/విశాఖపట్నం:వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోతెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేవిషయాన్ని జిల్లా కమిటీల నిర్ణయానికేవదిలేస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి చెప్పారు. స్థానిక పరిస్థితులనుబట్టి ఆ పొత్తులు ఉంటాయని ఆయనఆదిలాబాద్‌లో సోమవారం మీడియాప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
విధివిధానాలులేకుండా రాష్ట్ర ప్రభుత్వంనక్సల్స్‌తో చర్చలు జరుపుతోందనిఆయన విమర్శించారు. ఈ సమస్య అనేకరాష్ట్రాల్లో ఉన్నదని, జాతీయ స్థాయిలోనక్సలైట్ సమస్యపై ఒక నిర్దిష్టవిధానం ఉండాలని ఆయన అన్నారు.తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్‌కుస్పష్టత లేదని, ప్రపంచ బ్యాంక్ అప్పులవిషయంలో కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయంలేదని ఆయన అన్నారు.రైతాంగసమస్యలపై ఈ నెల ముప్పయవ తేదీనరాష్ట్ర బంద్ తలపెట్టినట్లు బిజెపిసీనియర్ నాయకుడు బండారుదత్తాత్రేయ విశాఖపట్నంలో ప్రకటించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోప్రభుత్వం విఫలమైందని ఆయనవిమర్శించారు.











Click it and Unblock the Notifications
