చర్చలపైప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు:గద్దర్
హైదరాబాద్:నక్సల్స్‌తో రెండో దశ చర్చలపైరాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనిసిపిఐ (మావోయిస్టు) ప్రతినిధులు గద్దర్,గంగన్న విమర్శించారు. సభలకుఅనుమతి ఇవ్వకపోవడం, ప్రభుత్వచేపడుతున్న ఇతర చర్యలు ఈవిషయాన్ని తెలియజేస్తున్నాయని వారుసోమవారం మీడియా ప్రతినిధులతోఅన్నారు.
తెలుగుదేశంప్రభుత్వం తరహాలోనే ప్రస్తుతకాంగ్రెస్ ప్రభుత్వం అణచివేతచర్యలు చేపడుతోందని వారువిమర్శించారు. మొదటి దశ చర్చలఅంశాల పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిప్రదర్శించడం లేదని వారన్నారు.చర్చలకు విఘాతం కలిగితే అందుకుపూర్తి బాధ్యత ప్రభుత్వానిదేననివారన్నారు. సమస్య పరిష్కారం ప్రజలుఉద్యమించాలని వారన్నారు.మావోయిస్టుకమ్యూనిస్టు సెంటర్ ( ఎంసిసి),పీపుల్స్‌వార్ విలీనమై సిపిఐ(మావోయిస్టు) ఏర్పడిన సందర్భాన్నిపురస్కరించుకొని హైదరాబాద్‌లోతలపెట్టిన సభకు ఎట్టకేలకుప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితేరంగారెడ్డి జిల్లా ఉప్పల్ పోలీసు స్టేషన్‌పరిధిలోని ఫిర్జాదిగూడాలో ఈ సభకు అనుమతిఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకుచెందినవారు ఈ సభలో పాల్గొంటారు. సిపిఐ(మావోయిస్టు) ఏర్పాటును పురస్కరించుకొనిదేశవ్యాప్తంగా నాలుగు బహిరంగసభలను తలపెట్టారు. ఇందులో భాగంగామొదటి సభ రేపు హైదరాబాద్‌లోజరుగుతుంది. తదనంతర సభలువరుసగా పాట్నా, కోల్‌కత్తా,న్యూఢిల్లీలలో జరుగుతాయి.











Click it and Unblock the Notifications
