వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చల ద్వారాఅయోధ్యపై ఒప్పందం: యన్‌డిఎ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అయోధ్యలో రామాలయ నిర్మాణంపైసంప్రదింపుల ద్వారా ఒక ఒప్పందానికిరావాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(యన్‌డి ఎ) అభిప్రాయపడింది. ప్రతిపక్షాలమధ్య సంబంధాన్ని మరింత పటిష్టంచేయాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నివాసంలో సోమవారంయన్‌డి ఎ పక్షాల సమావేశంజరిగింది.

యన్‌డిఎఅవసరం ఇప్పటికీ ఉన్నదని, గతఆరేళ్ల కాలంలోని మాదిరిగానే యన్‌డి ఎఐక్యతకు ఇప్పటికీ ప్రాధాన్యంఉన్నదని, స్వతంత్ర భారతదేశచరిత్రలో సుస్థిర సంకీర్ణ ప్రభుత్వాన్నిఅందించిన నేపథ్యంలో అది అవసరమనియన్‌డిఎ సమావేశం ఒక తీర్మానంచేసింది. ఈ తీర్మానాన్ని యన్‌డి ఎ కన్వీనర్‌జార్జి ఫెర్నాండెజ్‌ మీడియా ప్రతినిధులకుచదివి వినిపించారు.అయోధ్యవివాదాన్ని సామరస్యపూర్వకంగాపరిష్కరించుకుంటే జాతీయసమగ్రతను పెంపొందిస్తుందని,ఇతర ఏ విషయం భారత సమాజాన్నిపటిష్టం చేయనంతగా ఇది పటిష్టంచేస్తుందని ఫెర్నాండెజ్‌ అన్నారు.అయోధ్య వివాదంపై సంప్రదింపుల ద్వారాహిందూ, ముస్లింలు ఒక ఒప్పందానికిరావాలనేది తమ అభిమతమని ఆయనఅన్నారు.దేశఅంతర్గత భద్రతకు పొంచి ఉన్నముప్పు పట్ల యన్‌డిఎ ఆందోళనవ్యక్తం చేసింది. ఆరు నెలల పాలనలోదేశం అన్ని రంగాల్లో వెనక్కిపోయిందని, ధరలు పెరిగాయని,సామాన్య మానవుడి ప్రయోజనాలనుకాపాడడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలనువిస్మరించిందని ఫెర్నాండెజ్‌విమర్శించారు.కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని కలవడానికి తానుమంగళవారం చెన్నైకివెళ్తున్నట్లు ఆయన తెలిపారు.జయేంద్ర సరస్వతి అరెస్టుదురదృష్టకరమని ఆయనవ్యాఖ్యానించారు. జయేంద్ర పట్ల ఆ విధంగావ్యవహరించాల్సిన అవసరం లేదనిఆయన అభిప్రాయపడ్డారు.బిజెపిఅధ్యక్షుడు ఎల్‌.కె. అద్వానీ, జెడి - యునాయకుడు నితీష్‌ కుమార్‌, శరద్‌యాదవ్‌, బిజెపి నాయకులు ఎం.వెంకయ్యనాయుడు, జస్వంత్‌ సింగ్‌,వి.కె. మల్హోత్రా, అకాలీదళ్‌ నేత ఎస్‌. ఎస్‌.థిండ్సా, బిజెడి నాయకుడు అర్జున్‌చరన్‌ సేథీ, తృణమూల్‌ కాంగ్రెస్‌నాయకుడు దినేష్‌ త్రివేది, ఇండియన్‌ఫెడరల్‌ డెమొక్రటిక్‌ పార్టీనాయకుడు పి.సి. థామస్‌ ఈసమావేశంలో పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X