ఎపిప్రాజెక్టులకు అదనపు నిధులు:ఆహ్లూవాలియా
హైదరాబాద్:రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకుఅదనపు నిధులు కేటాయించే విషయాన్నిపరిశీలిస్తామని ప్రణాళికా సంఘంఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ఆహ్లూవాలియా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ప్రాజెక్టులకే కాకుండా ఇతర రాష్ట్రాలప్రాజెక్టులకు కూడా అదనపు నిధులుకేటాయించే విషయాన్ని పరిశీలస్తామనిఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ఒకకార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినఆహ్లూవాలియాకు, రిజర్వ్ బ్యాంక్‌గవర్నర్ వై.వి. రెడ్డికిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి మంగళవారంవిందు ఇచ్చారు.
ఈసందర్భంగా రాజశేఖర్ రెడ్డిఆహ్లూవాలియాకు రాష్ట్రానికి సంబంధించిననీటి పారుదల ప్రాజెక్టుల నివేదికనుసమర్పించారు. ఈ సమావేశంలోముఖ్యమంత్రి ప్రతిపాదనలపైప్రత్యేకంగా ఏమీ చర్చించలేదనిఆహ్లూవాలియా విలేకరులతో అన్నారు. రేపుబెంగుళూర్‌లో రాజశేఖర్ రెడ్డితోవిస్తృతంగా చర్చిస్తానని ఆయనచెప్పారు.ముఖ్యమంత్రిరాజశేఖర్ రెడ్డి రేపు ఢిల్లీకివెళ్తున్నారు. అంతకు ముందుఆయన బెంగుళూర్ వెళ్లిఆహ్లూవాలియాతో మాట్లాడుతారు.అనంతరం ఢిల్లీ చేరుకుంటారు.రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకుఅదనపు నిధులు కేటాయించాలని ఆయనకేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్నికోరనున్నారు. రేపు రాత్రి చిదంబరంవిందు ఇస్తున్నారు. ఇందులో రాజశేఖర్‌రెడ్డి పాల్గొంటారు. పదవ ప్రణాళికకమీషన్ రెండేళ్ల పనులపై రేపుసమీక్ష జరుపుతుంది. ఈ సమావేశంలోఆయన పాల్గొంటారు.











Click it and Unblock the Notifications
