కోర్టుతీర్పును శిరసా వహిస్తా: జయేంద్ర
వెల్లూర్:కోర్టు తీర్పును శిరసా వహిస్తాననిజయేంద్ర సరస్వతి తనతో చెప్పినట్లుభారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీమనోహర్ జోషీ చెప్పారు. ఆయనమంగళవారంనాడు వెల్లూరు జైలులోజయేంద్ర సరస్వతిని కలుసుకొని ఆయనతోఇరవై నిమిషాల పాటు గడిపారు.అనంతరం ఆయన విలేకరులతోమాట్లాడారు.
తనవంట తానే చేసుకోవడానకిఅనుమతిస్తే జయేంద్ర సరస్వతి జైలులోవిషం తీసుకోవచ్చుననే ప్రాసిక్యూషన్‌వాదన విడ్డూరంగా ఉన్నదని ఆయనఅన్నారు. "జయేంద్ర సరస్వతినేపాల్‌కు పారిపోతారని అంటున్నారు. పోలీసుకస్టడీలో ఉండగా అదెలాసాధ్యమవుతుంది? ఆయన ప్రతిష్టను,మఠం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగామాట్లాడుతున్నారు మురళీమనోహర్ జోషి అన్నారు.ప్రభుత్వఆమోదం లేకుండా జయేంద్ర సరస్వతికివ్యతిరేకంగా ఆ విధమైన చర్యలుతీసుకోవడం కష్టమని ఆయన అన్నారు.దాని వెనక గల కారణమేమిటో తానుచెప్పలేనని, అయితే ఇది సాధారణకేసులాగా అనిపించడం లేదని ఆయనఅన్నారు. తాను తమిళనాడుముఖ్యమంత్రి జయలలితనుకలుసుకోవడం లేదని, అయితే తననివేదికను ఆమెకు పంపుతానని ఆయనఅన్నారు. ప్రతి ఒక్కరికీ భగవంతుడువివేచనను ప్రసాదిస్తాడని తానుఅనుకుంటున్నట్లు స్వామీజీ అన్నట్లు ఆయనతెలిపారు.











Click it and Unblock the Notifications
