తెలుగుదేశంతోబిజెపి దోస్తీ కటీఫ్
తిరుపతి:తెలుగుదేశం పార్టీతో రాష్ట్ర భారతీయజనతా పార్టీ (బిజెపి) తన స్నేహానికితెంచేసుకుంటోంది. వచ్చే మున్సిపల్‌ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామనిబిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి బుధవారం విలేకరులసమావేశంలో చెప్పారు.
గతఎన్నికల్లో తమ ఇరు పార్టీల మధ్యసమన్వయ లోపం వల్ల జరిగిన నష్టాన్నిపరిగణనలోకి తీసుకొని పొత్తుల విషయాన్నితమ పార్టీ జిల్లా నాయకత్వాలకేవదిలేయాలని నిర్ణయించినట్లు ఆయనతెలిపారు. పార్టీ బలం పెరగడానికి ఆవిధమైన నిర్ణయం తీసుకున్నామనిఆయన చెప్పారు. కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టుపైఆయన ప్రభుత్వంపై తీవ్రంగామండిపడ్డారు. జయేంద్ర అరెస్టువిషయంలో ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి వ్యవహరించినతీరును ఆయన తప్పుపట్టారు.











Click it and Unblock the Notifications
