వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌సద్వినియోగం చేసుకోలేదు: జానా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఇచ్చిన అవకాశాన్ని నక్సలైట్లుసద్వినియోగం చేసుకోలేదని హోం మంత్రికె. జానారెడ్డి అన్నారు. సిపిఐ (మావోయిస్టు),జనశక్తి నక్సలైట్‌ నాయకులతోరెండో విడత చర్చలకు ఇరు పక్షాలమధ్య అవగాహన అవసరమనిఆయన బుధవారం మీడియాప్రతినిధులతో అన్నారు. ఇరు పక్షాలమధ్య అవగాహన ఉన్నదని, అయితేమరింత అవగాహన అవసరమనిఆయన వివరణ ఇచ్చారు.

చట్టాన్నిఅతిక్రమించడం, ప్రజలనుభయాందోళనకు గురి చేయడంవంటి చర్యలు ఉండకూడదని తాముభావించామని, ఈ విషయంలో ప్రభుత్వానికి,నక్సలైట్లకు మధ్య మరింతఅవగాహన అవసరమని ఆయనఅన్నారు. అయితే నక్సలైట్లతో రెండోవిడత చర్చలపై రాష్ట్ర మంత్రివర్గంచర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయనచెప్పారు.డిఐజిఅంజనా సిన్హా ఇంటిలో రౌడీషీటర్‌కు చెందినఆయుధాలు ఉన్న సంఘటనపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని జానా రెడ్డిఅన్నారు. మూడు హత్యలతో పాటు పలునేరాలతో సంబంధం ఉండిహైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌పోలీసులకు చిక్కిన తెలుగుదేశంశాసనసభ్యుడు పరిటాల రవీంద్ర ముఖ్యఅనుచరుడు, రౌడీ షీటర్‌ తమతంయాదగిరి అలియాస్‌ గిరి వాడిన రెండుఅక్రమ తుపాకులు, పది తూటాలు అంజనా సిన్హాఇంటిలో లభించాయి. ఏడాది క్రితం యాదగిరినుంచి ఆయుధాలను స్వాధీనంచేసుకున్న విషయంపై ఆమెవెల్లడించకపోవడం సంచలనాన్నిరేకెత్తించింది.కేసునుహైదరాబాద్‌ నగర నేరపరిశోధక విభాగం దర్యాప్తుచేస్తోందని, చట్టానికి ఎవరూ అతీతులుకారని హోం మంత్రి అన్నారు. అంజనా సిన్హాఇంటిలో యాదగిరి ఆయుధాలు ఉండడంపైవిచారణ జరుగుతోందని, నివేదికఅందగానే తగిన చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X