జయేంద్రపైగట్టి ఆధారాలున్నాయి: జయ

చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతికి వ్యతిరేకంగా హత్యశంకరరామన్‌ హత్య కేసులోపోలీసుల వద్ద దిగ్భ్రాంతికరమైన,బలమైన ఆధారాలున్నాయని తమిళనాడుముఖ్యమంత్రి జయలలిత అన్నారు. జయేంద్రసరస్వతి అరెస్టుపై ఆమె తన మౌనాన్నివీడి బుధవారం శాసనసభలో ఒకప్రకటన చేశారు.

జయేంద్రసరస్వతి అరెస్టు ద్వారా చట్టం ముందుఅందరూ సమానులేనని తమప్రభుత్వం రుజువు చేసుకుందని ఆమెఅన్నారు. ఈ నెల తొమ్మిదవ తేదీన పోలీసులచేతికి చిక్కిన వ్యక్తులు చెప్పిన మాటలు,వారి నుంచి స్వాధీనం చేసుకున్నవస్తువులు హత్యతో స్వామీజీకిసంబంధాలున్నాయనే విషయాన్నితెలియజేస్తున్నాయని ఆమె అన్నారు.

మఠంబ్యాంక్‌ ఖాతాలోంచి పెద్ద మొత్తంలోసొమ్ము తీసుకొని, కిరాయి హంతకులకుఇచ్చిన వ్యవహారంలో కూడా జయేంద్రసరస్వతికి సంబంధాలున్నాయని ఆమెచెప్పారు. దర్యాప్తును పక్కదోవపట్టించడానికి హత్యతో ఏ మాత్రంసంబంధం లేని ఐదుగురులొంగిపోవడం వెనక కూడా స్వామీజీప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయని ఆమెచెప్పారు. హత్య చేసినవారుజయేంద్రతో ఫోన్‌లో మాట్లాడినట్లుజయలలిత తెలిపారు.

స్వామీజీఅరెస్టులో చట్టాన్ని ఉల్లంఘించారనే బిజెపినాయకుడు మురళీ మనోహర్‌ జోషీ,యన్‌డి ఎ కన్వీపర్‌ జార్జి ఫెర్నాండెజ్‌విమర్శలను ఆమె ఖండించారు. స్వామీజీఅరెస్టు నుంచి వెల్లూరు జైలులో పెట్టేవరకు అన్ని చట్టపరమైన సూత్రాలనుపాటించినట్లు ఆమె స్పష్టం చేశారు.కంచి కామకోటి పీఠాన్ని తనఆధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనప్రభుత్వానికి లేదని జయలలిత స్పష్టంచేశారు.

జయేంద్రసరస్వతి అరెస్టును నిరసిస్తూశాసనసభా కార్యక్రామాలనుఅడ్డుకున్నందుకు బిజెపిశాసనసభ్యుడు హెచ్‌. రాజాను సభనుంచి బయటకు గెంటివేశారు.కంచిస్వామి అరెస్టుపై ప్రకటనచేయాల్సిందిగా స్పీకర్‌ కాలిముత్తుముఖ్యమంత్రి జయలలితను కోరారు.జయేంద్ర సరస్వతి అరెస్టును ఆ వెంటనేబిజెపి సభ్యులు నిరసిస్తూ అల్లరి చేశారు.జయేంద్ర సరస్వతిని వెంటనే విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ఆదేశం మేరకు రాజాను మార్షల్స్‌సభ బయటకు గెంటివేశారు. ఆ వెంటనేబిజెపి సభ్యులు వాకౌట్‌ చేశారు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+