సాఫ్ట్‌వేర్‌లోభారత్ అద్భుతాలు: బామర్
ముంబాయి:సాఫ్ట్‌వేర్ ఉన్న చోట అద్భుతాలుజరుగుతాయని, సాఫ్ట్‌వేర్‌లో భారత్‌అద్భుతమని మైక్రోసాఫ్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌ఆఫీసర్ స్టీవెన్ బామర్ అన్నారు.భారతదేశంలో కంప్యూటర్ల వాడకంతక్కువగా ఉన్నదని, కేవలం నాలుగుమిలియన్ల పర్సనల్ కంప్యూటర్లవాడకం మాత్రమే ఉన్నదని, చైనాలోదాదాపు పద్దెనిమిది మిలియన్ల పర్సనల్‌కంప్యూటర్లు ఉన్నాయని ఆయన అన్నారు.
సాఫ్ట్‌వేర్‌రంగంలో భారతదేశం విజయాలుసాధిస్తోందని ఆయన అన్నారు. సియన్‌బిసి- టివీ 18,మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన కార్యక్రమంలోబుధవారం ఆయన మాట్లాడారు.ప్రపంచ సాఫ్ట్‌వేర్ గ్రాడ్యుయేట్లలోముప్పై శాతం మందిభారతీయులేనని, నూతనావిష్కరణలకుకూడా భారతీయ విశ్వవిద్యాలయాల ప్రతిభనేఎక్కువగా కారణమని ఆయన అన్నారు.ప్రతిభ అనేది సహజమైన వనరు అని,దాన్ని దేశం కాపాడుకోవడంఅవసరమని ఆయన అన్నారుదేశఆర్థికాభివృద్ధిలో సాఫ్ట్‌వేర్ కీలకమైనపాత్ర పోషిస్తుందని, పేదరికనిర్మూలనలో కూడా దీని పాత్ర ఉంటుందనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
