పులిచింతలపైకోర్టు తీర్పు శిరోధార్యం: పొన్నాల
వరంగల్:పులిచింతల ప్రాజెక్టు విషయంలో హైకోర్టుతీర్పునకు కట్టుబడి ఉంటామని భారీ నీటిపారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్యయ్యస్పష్టం చేశారు. అయితే ఈలోగా పులిచింతలనిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసుకుంటామని ఆయన బుధవారంమీడియా ప్రతినిధుల సమావేశంలోచెప్పారు.
పులిచింతలవల్ల తెలంగాణకు అన్యాయంజరుగుతుందనే వాదనను ఖండిస్తూపులిచింతల వివరాలను అందించడానికిఆయన బుధవారం వరంగల్‌లోనిమీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. ఆవివరాలన్నీ చెప్పిన మరుక్షణంహైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం ఆయనకుఅందింది. మీడియా ప్రతినిధులు హైకోర్టుతీర్పుపై ఆయన ప్రతిస్పందననుఅడిగారు.పులిచింతలవల్ల తెలంగాణకు అన్యాయంజరుగుతుందనే విమర్శలో వాస్తవంలేదని ఆయన చెప్పారు. ముంపుగ్రామాలకు సంబంధించి కూడా తప్పుడులెక్కలు ఇస్తున్నారని, నల్లగొండ జిల్లాలోనిసున్నపురాయి నిక్షేపాలు దెబ్బతింటాయనే మాటలో కూడా వాస్తవం లేదనిఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్టుముంపు బాధితుల పునరాసానికి ఒకవిభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయనతెలిపారు.











Click it and Unblock the Notifications
