కంచి స్వామికేసు: కోర్టులో ఒకరి లొంగుబాటు
చెన్నై:శంకరరామన్ హత్యతోసంబంధం ఉందని భావిస్తున్న ఒకవ్యక్తి బుధవారం అలంతూర్ కోర్టులోలొంగిపోయాడు. అతనికి జ్యుడిష్యల్ కస్టడీవిధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యక్తిలొంగుబాటుతో వరదరాజ పెరుమాల్‌దేవాలయం మేనేజర్‌శంకరరామన్ హత్య కేసులోపద్దెనిమిది మందిని అదుపులోకితీసుకున్నట్లయిందని పోలీసులు చెప్పారు. ఈకేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి ప్రధాననిందితుడు.
లొంగిపోయినఅంబికాపతిని పదిహేను రోజుల పాటు రిమాండ్‌చేస్తూ అలంతూర్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్‌పరమరాజన్ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం అంబికాపతిని చెన్నై కేంద్రకారాగారానికి తరలించారు. ఈ కేసులోఅరెస్టు చేసిన మరో ఇద్దరిని పోలీసులుకాంచీపురం జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్‌ముందు మంగళవారంప్రవేశపెట్టారు. రిమాండ్ పొడగింపుకోసం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.ఇదిలావుంటే జాతీయ ప్రజాస్వామ్య కూటమికన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్‌బుధవారంనాడు కంచికామకోటిఉత్తరాధిపతి విజయేంద్ర సరస్వతినికలుసుకున్నారు. విజయేంద్ర సరస్వతిధ్యానంలో ఉండడంతో ఆయనమధ్యాహ్నం ఒకటిన్నర వరకునిరీక్షించవలసి వచ్చింది. జయేంద్రసరస్వతి అరెస్టులో మానవ హక్కులనుఉల్లంఘించారని ఫెర్నాండెజ్‌విమర్శించారు.











Click it and Unblock the Notifications
