వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలపైనేనక్సల్స్‌తో ఇక చర్చలు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌:ఆయుధాలు వదిలిపెట్టడంపైనే నక్సలైట్‌నేతలతో రెండో విడత చర్చలుజరగాలనేది తమ ఉద్దేశమనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఆయుధాలువదిలే పెట్టే విషయంపై చర్చలకురావాల్సిందిగా తాము సిపిఐ (మావోయిస్టు),సిపిఐ (యంయల్‌) జనశక్తినాయకులను కోరినట్లు ఆయనబుధవారం విలేకరులతోచెప్పారు.

నక్సలైట్లుఆయుధాలు వీడితేనే రాష్ట్రంలో శాంతిసాధ్యమని ఆయన అన్నారు. తామునక్సలైట్‌ నేతలు తమముందుకు తెచ్చిన సమస్యలనుతీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, అప్పుడుఆయుధాల అవసరం ఏమిటని, నక్సలైట్లుపూర్తిగా ఆయుధాలు వదలాలని ఆయనఅన్నారు. ఆయుధాలు ఎలా వదలాలనేవిషయంపై మాట్లాడడానికి చర్చలకురావాలని తాము నక్సలైట్లను పిలిచామనిఆయన చెప్పారు. వ్యక్తిగానీ వ్యక్తులగుంపుగానీ ఆయుధాలతో సంచరించడాన్నిరాజ్యాంగం ఒప్పుకోదని ఆయన అన్నారు.నక్సలైట్లు కూడా తమ అన్నలూతమ్ముళ్లేనని, అందువల్ల వారితోచర్చలకు తాము సిద్ధపడ్డామని ఆయనఅన్నారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలేసిఎన్నికల్లో పోటీ చేయవచ్చునని,ప్రజాస్వామికంగావ్యవహరించవచ్చునని ఆయనఅన్నారు.తుంగభద్రప్రాజెక్టులపై రాజశేఖర్‌ రెడ్డి కర్ణాటకముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌తోచర్చించారు. ఈ ప్రాజెక్టులపై కర్ణాటకకుఒక ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్నిపంపుతామని ఆయన చెప్పారు. గతప్రభుత్వ విధానం వల్లనే ప్రస్తుతదుస్థితి తలెత్తిందని ఆయనవిమర్శించారు. తాము ప్రపంచ బ్యాంకుఅప్పులకు వ్యతిరేకం కాదని, అయితేప్రజలకు హాని కలిగించే షరతులకుఅంగీకరించకూడదనేది తమఅభిమతమని ఆయన చెప్పారు.ఆస్పత్రుల్లో యూజర్‌ ఛార్జీలు వసూలుచేయాలనే షరతును ఆయనఉదహరిస్తూ ప్రభుత్వాస్పత్రులకునిరుపేదలే వస్తారని, వారి నుంచి డబ్బులువసూలు చేయడం సరికాదనేది తమఉద్దేశమని ఆయన అన్నారు. పులిచింతలప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుపై తీర్పు ప్రతిచూసిన తర్వాత ఏమైనా చెప్పగలననిఆయన అన్నారు. ఆయన గురువారంహైదరాబాద్‌కు తిరిగివస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X