పులిచింతలపైప్రభుత్వం మీద ఒత్తిడి
విజయవాడ:కృష్ణా నదిపై తలపెట్టిన పులిచింతలప్రాజెక్టుకు నెలలోగా అన్ని అనుమతులూసాధించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని కృష్ణా డెల్టా నాయకులునిర్ణయించారు. పులిచింతల ప్రాజెక్టుపనులను ఆపేయాలని రాష్ట్ర హైకోర్టుతీర్పు ఇచ్చిన నేపథ్యంలో కృష్ణా డెల్టారాజకీయ నాయకులు గురువారంవిజయవాడలో సమావేశమయ్యారు.
ఈసమావేశంలో యలమంచిలి శివాజీ, దేవినేనినెహ్రూ, మండలి బుద్ధప్రసాద్, పాటూరిరామయ్య తదితరులు పాల్గొన్నారు.పులిచింతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ప్రభుత్వం నాటకం ఆడుతోందని, కోర్టుతీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికేఅనుకూలమని, ప్రాజెక్టును చేపట్టేఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)ని ప్రభుత్వంలో చేర్చుకున్నకాంగ్రెస్‌కు లేదని సమతా పార్టీనాయకుడు కృష్ణా రావు విమర్శించారు.ఆయన సమావేశం నుంచి వాకౌట్‌చేశారు.











Click it and Unblock the Notifications
