జయేంద్రకేసు: బెయిల్‌పై నిర్ణయం వాయిదా
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులోనిందితుడైన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతిని పోలీసు కస్టడీకిఅప్పగించాలనే ప్రాసిక్యూషన్ పటిషన్‌పైతన నిర్ణయాన్ని కాంచీపురం కోర్టురిజర్వ్ చేసుకుంది.ఈ విషయంపై కోర్టు తన నిర్ణయాన్నిశుక్రవారం పదిన్నర గంటలకువెల్లడిస్తుంది.
కాగాజయేంద్ర సరస్వతి బెయిల్‌పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు తననిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదావేసింది. కాంచీపురం కోర్టులో జయేంద్రసరస్వతి గురువారం హాజరయ్యారు.వెల్లూరు జైలు నుంచి ఆయనను ఉదయంపదకొండు గంటల పదిహేను నిమిషాలకుకారు కాన్వాయ్ ద్వారా తీసుకొచ్చి కోర్టులోహాజరు పరిచారు.ఇదిలావుంటే,జయేంద్ర సరస్వతిని కలుసుకోవడానికిఅనుమతి ఇవ్వవలసిందిగా కంచికామకోటి ఉత్తరాధిపతి విజయేంద్రసరస్వతి చేసుకున్న విజ్ఞప్తిని కోర్టుతిరస్కరించింది.











Click it and Unblock the Notifications
