ఇంట్లోముద్రగడ ఆమరణ నిరశనదీక్ష
రాజమండ్రి:తెలుగుదేశం నాయకుడు, మాజీపార్లమెంటు సభ్యుడు ముద్రడపద్మనాభం తూర్పు గోదావరి జిల్లాతన స్వగ్రామం కిర్లంపూడిలోఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.ఆయన తనకు తాను గృహనిర్బంధం విధించుకున్నారు.
ముద్రగడపద్మనాభానికి రెండు రైస్ మిల్లులు, ఒకకోల్డ్ స్టోరేజీ ఉన్నాయి. బకాయిలుచెల్లించనందుకు వాటికి అధికారులువిద్యుత్ సరఫరాను నిలిపేశారు.కరెంట్ బిల్లుల సవరణకు సంబంధించిఅంతకు ముందు ముద్రగడపద్మనాభం ఒక దరఖాస్తుచేసుకున్నారు. దీనికి సంబంధించి తాములిఖిత పూర్వక సమాధానం ఇచ్చామనివిద్యుచ్ఛక్తి అధికారులు అంటున్నారు. అదితనకు అందలేదని పద్మనాభంవాదన. ఆరోపణలను రుజువు చేయాలనితన స్టేట్‌మెంట్ కాపీలను తీసుకొనిన్యాయం చేయాలని తాను కోరారని ఆయనచెబుతున్నారు.విద్యుత్‌బిల్లుల సవరణయినా చేయాలని లేదా దీక్షచేపట్టి మరణించడానికి అనుమతిఅయినా ఇవ్వాలని తాను కోరానని, దీనికి వారినుంచి సమాధానం లేదని, దీక్ష ద్వారామరణించడానికి వారు అనుమతిఇచ్చినట్లు దీన్ని తీసుకుంటున్నానని ఆయనఅంటున్నారు.











Click it and Unblock the Notifications
