అద్వానీకిక్షమాపణలు చెప్పిన ఉమాభారతి
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచిసస్పెండ్ అయిన ఉమాభారతి దిగి వచ్చారు.క్షమాపణలు కోరుతూ ఆమె బిజెపిఅధ్యక్షుడు ఎల్.కె. అద్వానీకిగురువారం ఒక లేఖ రాశారు. వారంరోజుల క్రితం పార్టీ సమావేశంలోనాయకత్వంపై విరుచుకుపడి,సమావేశం నుంచి బయటకు వచ్చి ఆమెపార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు .
తనసస్సెన్షన్‌ను ఎత్తివేయాలని ఆమె ఆ లేఖలోకోరారు. సమావేశంలో తానుబాధపెట్టినందుకు తానుబాధపడుతున్నానని ఆమె అద్వానీకితెలియజేశారు. అద్వానీని తాను రాజకీయమార్గదర్శిగానే కాకుండా తండ్రితోసమానంగా గౌరవిస్తున్నానని ఆమెఅన్నారు. అద్వానీకి ఉమా భారతి రాసిన లేఖప్రతులను ఆమె అనుచరులు మీడియాకుఅందజేశారు.తానుబిజెపికి ఎప్పుడూ నష్టం చేయలేదని,తాను ఎల్లవేళలా భగవంతుడినిప్రార్థిస్తానని, ఆ ప్రార్థన తనకుసరైన మార్గాన్ని చూపుతుందని ఆమెఅన్నారు. ఆ సమావేశంలో మాజీ ప్రధానిఅటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఉన్నందునఇటువంటి లేఖనే ఆయనకు రాస్తున్నట్లుఆమె తెలిపారు.











Click it and Unblock the Notifications
