ముగ్గురుఖైదీల ఆత్మహత్యా యత్నం
వరంగల్:వరంగల్ కేంద్ర కారాగారంలోనిముగ్గురు ఖైదీలు ఆత్మహత్యా యత్నానికిపాల్పడ్డారు. వారు ప్రస్తుతంవరంగల్‌లోని ఎం.జి. ఎం. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
గురువారంసాయంత్రం ఐదు గంటలకు జైలు సిబ్బందిఅపస్మారక స్థితిలో ఉన్న ఖైదీలనుగమనించారు. వెంటనే అధికారులకుతెలియజేశారు. తక్షణమే వారినిఆస్పత్రికి తరలించారు. యం.డి.యాకూబ్, బొగ్గు రవి, వెంకటరెడ్డి అనేముగ్గురు ఖైదీలు ఆత్మహత్యా యత్నానికిపాల్పడ్డారు. జైలు సూపరింటిండెంట్ రావినర్సింహారెడ్డి వేధింపులుభరించలేకనే తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని ఖైదీలుఅంటున్నారు.











Click it and Unblock the Notifications
