జయేంద్రకేసు: బిజెపి ఆందోళనలు
న్యూఢిల్లీ:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని పోలీసు కస్టడీకి రిమాండ్‌చేయడంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి)తీవ్రంగా మండిపడుతోంది. ఈసంఘటనను నిరసిస్తూ బిజెపి శనివారంనుంచి ఆందోళనకు శ్రీకారంచుడుతోంది.
కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టు, తదనంతర పరిణామాలపైచర్చించడానికి బిజెపి నేతలుశుక్రవారం మాజీ ప్రధాని అటల్ బిహారీవాజ్‌పేయి నివాసంలోసమావేశమయ్యారు. శనివారంనుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగాధర్నాలు, ఉపవాస దీక్షలు చేయాలనిసమావేశంలో నిర్ణయించారు.శనివారంనాడు బిజెపి అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్దకఠిన ఉపవాస దీక్ష చేపడతారు.ఆదివారంనాడు మాజీ కేంద్ర మంత్రిమురళీ మనోహర్ జోషీ ఉపవాస దీక్షచేస్తారు. సమావేశానంతరం బిజెపినాయకులు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌కలామ్‌ను కలిశారు.జయేంద్రసరస్వతిని వెంటనే విడుదల చేయాలనివారు రాష్ట్రపతిని కోరారు. జయేంద్రసరస్వతి పోలీసు కస్టడీకి కేంద్రప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాలేబాధ్యత వహించాలని వారుఅన్నారు.











Click it and Unblock the Notifications
