ఇందిరాగాంధీకిఘన నివాళి
న్యూఢిల్లీ:దివంగతప్రధానమంత్రి ఇందిరాగాంధీ 87వజన్మదినోత్సవం సందర్భంగా జాతి యావత్తూఆమెకు ఘనంగా నివాళులర్పించింది.
ప్రధానిమన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ, కేంద్రమంత్రులు శివరాజ్‌పాటిల్,కె. నట్వర్ సింగ్, సునీల్‌దత్, మీరా కుమార్,ఢి ల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులుశక్తిస్థల్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలవిద్యార్థులు భక్తిగీతాలు ఆలపించి త్రివర్ణబెలూన్లను గాల్లోకి వదిలారు. కొన్ని బెలూన్లమీద ఇందిరాగాంధీ చిత్రాలను ముద్రించారు.గతంలో ఇందిర చేసిన ప్రసంగాల టేపులనుఈ సందర్భంగా ప్రసారం చేశారు.
హైదరాబాద్‌లోగాంధీభవన్‌లోని ప్రకాశం హాల్‌లో జరిగినఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలోముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు, తదితరులుపాల్గొన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతిసందర్భంగా ముఖ్యమంత్రి గుంటూరుజిల్లాలో ఇందిర ప్రభ కార్యక్రమానికిఆయన శ్రీకారం చుట్టారు.నిరుపయోగకమైన బలహీన వర్గాలభూములను సాగులోకి తెచ్చేకార్యక్రమం ఇందిర ప్రభ.
ఇదేసందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాజీవ్‌యువశక్తి కార్యక్రమాన్నిప్రారంభించారు. లక్ష మందియువకులకు స్వయం ఉపాధికల్పించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు.












Click it and Unblock the Notifications
