టెండర్లఖరారు తొందరపాటు కాదు: రోశయ్య
హైదరాబాద్:రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపనులను చట్టబద్దంగా,వేగవంతంగా చేయడానికిటెండర్లను ఆహ్వానిస్తూ తాజానోటిఫికేషన్ జారీ చేశామని ఆర్థిక మంత్రికె. రోశయ్య చెప్పారు. సాగు నీటిప్రాజెక్టుల పనుల టెండర్ల ఖరారునుకొట్టివేస్తూ హైకోర్టు గురువారంఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ తాజానోటిఫికేషన్ విడుదలైంది.
టెండర్లఖరారులో తమ చర్యలు తొందరపాటుకాదని, తొందరగా ప్రాజెక్టులు పూర్తికావాలనే ఉద్దేశ్యంతోనే ఖరారుచేశామని, సాంకేతిక లోపాల వల్ల కోర్టుకొట్టివేసిందని ఆయన అన్నారు. కోర్టుతీర్పుపై తిరిగి అప్పీల్‌కు వెళ్లడంవంటి న్యాయపరమైన చర్యలుతీసుకుంటే జాప్యం జరుగుతుందనేఉద్దేశ్యంతోనే తాజా నోటిఫికేషన్ జారీచేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయనస్పష్టం చేశారు ప్రజల ఆకాంక్షల మేరకుసాగునీటి ప్రాజెక్టులు త్వరతిగతినపూర్తి చేయడమే తమ లక్ష్యమనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
