బంద్‌పాక్షికం: హైదరాబాద్‌లో బస్సులధ్వంసం
న్యూఢిల్లీ/హైదరాబాద్: కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్టుకునిరసనగావిశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి),భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారంతలపెట్టిన బంద్‌కు మిశ్రమస్పందన లభించింది. న్యూఢిల్లీలో బంద్‌ప్రభావం పెద్దగా కనిపించలేదు.దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేఉన్నాయి.
హైదరాబాద్‌లోనిలంగర్‌హౌజ్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పది బస్సులుధ్వంసమయ్యాయి. ఐదుగురువ్యక్తులు మూడు మోటార్ బైక్‌ల వచ్చిరాళ్లు రువ్వి పారిపోయారని పోలీసులుచెప్పారు. రహ్మత్‌నగర్ ప్రాంతంలోబస్సుల టైర్లలోని గాలి తీసేయడానికిప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకితీసుకున్నారు. హైదరాబాద్‌లో బంద్‌కుమిశ్రమ స్పందన లభించింది. అయితేజనసంచారం రోజు కన్నా తక్కువగా ఉంది.కొన్ని విద్యాసంస్థలను ఆందోళకారులుబలవంతంగా మూసేయించారు.ముంబాయిలోకూడా బంద్‌కు పెద్దగా ప్రతిస్పందనలభించలేదు. విహెచ్‌పి కార్యకర్తలురోడ్డుపై వాహనాలను, రైళ్లను ఆపడానికిప్రయత్నించారు. బస్సులపై రాళ్లురువ్వారు దీంతో నలుగురు డ్రైవర్లు,ముగ్గురు కండక్లర్లుగాయపడ్డారు. ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. కొన్ని రూట్లలో బస్సుసర్వీసులను నిలిపేశారు.రాజస్థాన్‌లోసాధారణ జనజీవనం కాస్తా దెబ్బతిన్నది. యాభై శాతం దుకాణాలు, వాణిజ్యసంస్థలు మూతపడ్డాయి.











Click it and Unblock the Notifications
