స్వామి పోలీసుకస్టడీ పెంపునకు కంచి కోర్టు నో
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులోప్రధాన నిందితుడు కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి పోలీసుకస్టడీని పొడిగించాలనే ప్రాసిక్యూషన్‌విజ్ఞప్తిని కాంచీపురం కోర్టు తిరస్కరించింది.జయేంద్ర సరస్వతి పోలీసు కస్టడీనిమంగళవారం మధ్యాహ్నం రెండుగంటల వరకు పొడిగించాలని పబ్లిక్‌ప్రాసిక్యూటర్ కోరారు.
జయేంద్రసరస్వతిని ఇప్పటికే తగితనంతగాఇంటరాగేట్ చేశారని, అందువల్ల కస్టడీనిపొడిగించాల్సిన అవసరం లేదని ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ ఉత్తమరాజ్‌అన్నారు.జయేంద్రసరస్వతిని కోర్టులో హాజరు పరచగానే -జయేంద్ర సరస్వతి బ్యాంకు ఖాతాలనుపరిశీలించేందుకు పోలీసు కస్టడీపొడిగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజ్ఞప్తిచేశారు. ఆదివారం సెలవు అయినందున ఆపని చేయలేకపోయినట్లు ఆయనతెలిపారు.అప్పుడుమెజిస్ట్రేట్ జయేంద్ర సరస్వతి అభిప్రాయంఅడిగారు. వారికి వేయాల్సిన ప్రశ్నలన్నీవేశారని, ఇంకా అది అవసరమని తానుఅనుకోవడం లేదని జయేంద్ర సరస్వతిచెప్పారు. జయేంద్ర సరస్వతి అవసరంలేకుండా కూడా బ్యాంక్ ఖాతాలనుపరిశీలించవచ్చుని స్వామి తరఫున్యాయవాదులు అన్నారుపోలీసులువేధించారా అని మెజిస్ట్రేట్ అడిగితే లేదనిజయేంద్ర సరస్వతి చెప్పారు. వైద్యులురోజుకు మూడు సార్లు పరీక్షిస్తున్నారనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
