పార్టీలోఅసంతృప్తి లేదు: రాజగోపాల్ లేఖలపైకెకె
హైదరాబాద్:తమ పార్టీలో అసంతృప్తి లేదనిప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుస్పష్టం చేశారు. పార్టీలోభేదాభిప్రాయాలున్నాయే తప్ప అసంతృప్తిలేదని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్ల ఖరారులోపాలను ఎత్తి చూపుతూ విజయవాడపార్లమెంటు సభ్యుడు లగడపాటిరాజగోపాల్ లేఖలు రాయడంపై ఆయన ఆవిధంగా అన్నారు. పత్రికలకు ఎక్కేముందు ఎవరైనా ముందు పార్టీనిసంప్రదిస్తే బాగుంటుందని ఆయనఅభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డితోనూ,పిసిసితోనూ ముందు మాట్లాడి ఉంటేబాగుండేదని ఆయన అన్నారు.రాజగోపాల్‌లేఖలు రాయడం తప్పేమి కాదని, అయితేతాము రాజగోపాల్ నుంచి వివరణఅడిగామని, రాజగోపాల్ నుంచిసమాధానం రావాల్సి ఉన్నదని ఆయనచెప్పారు. రాజగోపాల్ పార్లమెంటుసభ్యుడనే విషయం మర్చిపోరాదని, ఈవిషయాన్ని ముఖ్యమంత్రితోనూ, పార్టీహైకమాండ్‌తోనూ మాట్లాడుతాననిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
