సెహ్వాగ్‌

కాన్పూర్‌:భారత్‌, దక్షిణాప్రికాల మధ్యజరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ డ్రాదిశగా సాగుతోంది. దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్‌ భారీ స్కోర్‌ను అధిగమించేందుకుభారత బ్యాట్స్‌మెన్‌ సాగుతున్నారు.ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 164 పరుగులతోభారత్‌ను ఆదుకున్నాడు. మరోఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ నాలుగుపరుగులతో సెంచరీని మిస్సయ్యాడు.అతను 96 పరుగులు చేసి అవుటయ్యాడు.

వికెట్‌నష్టపోకుండా సోమవారం ఆట ముగిసేసమయానికి 185 పరుగులు చేసినభారత్‌ మంగళవారంనాడు నాలుగువికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది.గంభీర్‌తో తొలి వికెట్‌కు 218 పరుగులభాగస్వామ్యాన్ని జోడించి రికార్డుసృష్టించాడు. స్వదేశీ గడ్డపైదక్షిణాఫ్రికా మీద అత్యధిక పరుగులుచేసిన భారత ఆటగాడిగా కూడా సెహ్వాగ్‌రికార్డు సృష్టించాడు. సెహ్వాగ్‌ ఈ ఏడాదితొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడి మూడుసెంచరీలు సాధించాడు.మంగళవారంఆట ముగిసే సమయానికి రాహుల్‌ ద్రావిడ్‌యాబై రెండు పరుగులతో, వివియస్‌లక్ష్మణ్‌ నాలుగు పరుగులతో క్రీజ్‌లోఉన్నారు. గంగూలీ యాబై ఏడు పరుగులుచేసి అవుటయ్యాడు. సచిన్‌ టెండూల్కర్‌మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు.అతను మూడు పరుగులకే పెవిలియన్‌దారి పట్టాడు. దట్టమైన పొగ మంచుఅలుముకోవడంతో ఆట గంట ఆలస్యంగాప్రారంభమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలోపొలాక్‌ ఒక వికెట్‌ తీసుకోగా హాల్‌ రెండువికెట్లు, బ్రూయిన్‌ ఒక వికెట్‌తీసుకున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+