జయేంద్రకేసు: సిబిఐకి బదిలీకై పిటిషన్
న్యూఢిల్లీ:శంకరరామన్ హత్య కేసునుకేంద్ర దర్యాప్తు బృందానికి (సిబిఐకి)అప్పగించాలని కోరుతూ కంచి శంకరాచార్యజయేంద్ర సరస్వతి తరఫునసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.శంకరరామన్ హత్య కేసులోజయేంద్ర సరస్వతిని తమిళనాడుపోలీసులు అరెస్టు చేసిన విషయంతెలిసిందే.
పార్లమెంటుసభ్యుడు బి.పి. సింఘాల్ ఈ పిటిషన్‌నుసుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఛీఫ్ జస్టిస్‌లహోటి కోర్టులో ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకురానుంది. శంకరాచార్య ప్రస్తుతంతమిళనాడులోని వెల్లూరు జైలులో ఉన్నారు.ఆయన బెయిల్ పిటిషన్‌ను మద్రాసుహైకోర్టు కొట్టివేసింది.











Click it and Unblock the Notifications
