అప్పు విదేశీయాత్రకు హైకోర్టు బ్రేక్
చెన్నై:శంకరరామన్ హత్య కేసులోకీలక నిందితుడైన అప్పుకు విదేశాలకువెళ్లడానికి అనుమతిస్తూ వెలువడినఆదేశాలపై మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చింది.కాన్సామి గోపాల కృష్ణస్వామి అలియాస్ అప్పువిదేశాలకు వెళ్లడానికి ఇచ్చిన అనుమతినిరద్దు చేయాలని కోరుతూ నగరపోలీసులు పెట్టుకున్న పటిషన్‌పై ఛీఫ్ జస్టిస్‌యన్. దినకర్, జస్టిస్ డి.మురుగేశన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్ ఆ స్టే ఇచ్చింది.
శంకరరామన్‌హత్య కేసులో కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టయిన విషయం తెలిసిందే. ఇదేకేసులో నిందితుడైన అప్పు వైద్యచికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడానికిఅనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టునుకోరారు. ఈ కోరిక మేరకు నవంబర్‌నాలుగవ తేదీన జస్టిస్ కె. రవిరాజాపాండియన్ అప్పుకు అనుమతి ఇస్తూఆదేశాలు ఇచ్చారు.సింగిల్‌జడ్జి ఇచ్చిన ఆదేశాలు పాస్‌పోర్టు చట్టానికివిరుద్ధమని పోలీసులు ఆ ఆదేశాలను రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశారు. అప్పుపై ఎనిమిది కేసులో పెండింగ్‌లుఉన్నాయని, కొన్ని కేసులలో విచారణ జరిగిందని,నిందితుడి హాజరు కోసం వివిధ తేదీలనుఖరారు చేశారని పోలీసులు తమపిటిషన్‌లో అన్నారు.











Click it and Unblock the Notifications
