ఏడాదిలోరైతుల కష్టాలు హుష్‌కాకి: వైయస్
కర్నూలు:ఏడాదిలో రైతుల కష్టాలన్నీదూరమవుతాయని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅన్నారు. కర్నూలు జిల్లాలో ఆయనమంగళవారం రాజీవ్ పల్లెబాటకార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగుదేశంపార్టీపై ఆయన రాజీవ్ పల్లెబాటకార్యక్రమంలో తీవ్రంగాధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులనిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీఅడ్డుకుంటోందని ఆయన విమర్శించారు.ప్రజలు ఎన్నికలకు ముందు తమ వెంటఉండి తెలుగుదేశం పార్టీని ఎండగట్టారనిఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలనుఅమలు చేసి తీరుతామని ఆయనచెప్పారు.శ్రీశైలంరిజర్వాయర్ నీటిని రాయలసీమప్రాంతానికి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు,దక్షిణ తెలంగాణకు కేటాయిస్తామనిఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలోనినగరం దోణ బ్యాలెన్సింగ్‌రిజర్వాయర్‌కు పదిహేను కోట్ల రూపాయలుకేటాయించినట్లు ఆయన తెలిపారు.











Click it and Unblock the Notifications
