కంచి కేసు:ఎదురు తిరిగిన నిందితులు
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసుపోలీసులకు అడ్డం తిరిగింది. ఈ కేసులోని ఇద్దరునిందితులు పోలీసులకు అడ్డం తిరిగారు.ఈ కేసులో కంచికామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి అరెస్టయిన విషయంతెలిసిందే.
తననునవంబర్ తొమ్మిదవ తేదీన కోర్టులోహాజరు పరచడానికి ముందు మూడు తేదీనుంచి తనను అక్రమంగానిర్బంధించారని కదివరన్ అనేనిందితుడు కాంచీపురం జ్యుడిష్యల్‌మెజిస్ట్రేట్‌కు ఇన్ కెమెరా వాంగ్మూలంలోచెప్పాడు. పోలీసులు తనను చిత్రహింసలుపెట్టారని, తాను ఆరోగ్య సమస్యలతోబాధపడుతున్నానని మరో నిందితుడురెజిని అలియాస్ చిన్న చెప్పాడు.
తమనుపోలీసులు విపరీతంగా చిత్రహింసలుపెట్టారని, ఇంతకు ముందు తాము ఇచ్చినవాంగ్మూలాలు పోలీసుల బలవంతం మీదఇచ్చినవేనని వారు కోర్టులో చెప్పారు.ఇదిలావుంటే, మూడో కేసులో కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతికివారంట్ జారీ చేయడానికి పోలీసులుసిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మరో కేసులో జయేంద్రకుఅరెస్టు వారంట్ జారీ చేశారు.కంచికామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతికి పోలీసులురెండో అరెస్టు వారంట్‌అందజేయడంపై కంచి మఠంఆశ్చర్యం వ్యక్తం చేసింది. మఠంఅనుచరుడు జి. రాధాకృష్ణన్‌పై దాడికేసులో ఈ అరెస్టు వారంట్ జారీ చేశారు. ఈఅరెస్టు వారంట్‌కు ప్రాతిపదిక ఏమిటోతెలియదని మఠం వ్యాఖ్యానించింది.











Click it and Unblock the Notifications