కన్నడసినీ పరిశ్రమ పద్దతి బాగా లేదు
హైదరాబాద్/బెంగుళూర్: కర్ణాటక సినీ పరిశ్రమపద్ధతి బాగా లేదని తెలుగు సినీనిర్మాతలు అభిప్రాయపడ్డారు. పరభాషాచిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోఅనుమతించకూడదని కర్ణాటక సినీపరిశ్రమ ఆందోళనలు, ప్రదర్శనలుచేయడం అర్థరహితమనివారన్నారు. కన్నడంలో తెలుగు భాషాచిత్రాలకు ఉన్న ఆదరణ తగ్గించడానికివారు ప్రయత్నిస్తున్నారని వారన్నారు.విడుదల చేయడానికి సిద్ధపడితే అన్నిరకాల భద్రత కల్పిస్తున్నారనివారంటున్నారు.
కన్నడసినీ పరిశ్రమ కార్యకలాపాలుగురువారం పూర్తిగా స్తంభించాయి.కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌నేతృత్వంలో సినీ కళాకారులుగురువారం బెంగుళూర్‌లోప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలోపరభాషా చిత్రాల విడుదలకు మూడు వారాలవిరామం విధించాలని వారు డిమాండ్‌చేశారు. దాదాపు నాలుగు వేల మంది ఈప్రదర్శనలో పాల్గొన్నారు.రాజ్‌కుమార్ నుంచి వినతిపత్రంఅందుకుని ర్యాలీని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌పైఆందోళకారులు చెప్పులు విసిరారు.మరిన్నిఅవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛేంబర్‌ఆఫ్ కామర్స్ వద్ద దుండగులునాలుగు కార్లపై రాళ్లు రువ్విధ్వంసం చేశారు. ఒక కార్యాలయంపై,ఎటియం సెంటర్‌పై కూడా దాడిచేశారు.











Click it and Unblock the Notifications
