పోలీసులకు,నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు
హైదరాబాద్:కరీంనగర్ జిల్లాలో గురువారంపోలీసులకు, మావోయిస్టు నక్సలైట్లకుమధ్య కాల్పులు జరిగాయి. కరీంనగర్‌జిల్లా చందుర్తి మండలం రుద్రంగిగ్రామ సమీపంలోని కుప్పలగుట్ట వద్దసాయంత్రం మూడున్నర గంటలప్రాంతంలో ఇరు వర్గాల మధ్య కాల్పులుజరిగాయి.
పోలీసులకు,నక్సలైట్లకు మధ్య ఎనబై రౌండ్లుకాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచిపోలీసులు ఒక తుపాకిని, ఐదుద్విచక్రవాహనాలను స్వాధీనంచేసుకున్నారు. నలుగురు మిలిటెంట్లనుఅరెస్టు చేశారు. పకడ్బందీ సమాచారంమేరకే పోలీసులు ఐదు వాహనాలపై వచ్చిననక్సలైట్లపై కాల్పులు జరిపారనిమావోయిస్టు ప్రతినిధులు అంటున్నారు.నక్సలైట్లకు,ప్రభుత్వానికి మధ్య చర్చలుప్రారంభమైన తర్వాత ఇరువర్గాలకు జరిగిన కాల్పులు ఇదేమొదటిసారి. అయితే నక్సలైట్లు స్థానికరాజకీయ నాయకులపై బుధవారంపెద్ద యెత్తున దాడులు చేశారు.కడపజిల్లా మాధవరంలో దగ్గుబాటినాయుడు అనే స్థానిక రాజకీయనాయకుడిని నక్సలైట్లు కొట్టారు. దాంతోఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నాడు.మహబూబ్‌నగర్ జిల్లాలోవెంకటేశ్వర్లు అనే వ్యక్తిపైనక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలోఅతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞానసంస్థ (నిమ్స్)లో అతను చికిత్సపొందుతున్నాడు.











Click it and Unblock the Notifications
