మావోయిస్టులసభను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ:ఢిల్లీలో సిపిఐ-మావోయిస్టుల సభకు పోలీసులుఅనుమతిని నిరాకరించారు. అనుమతిలేకుండా సభ నిర్వహించడానికి ప్రయత్నించినసిపిఐ-మావోయుస్టు నాయకులను,విప్లవ రచయితల సంఘం సభ్యులనుపోలీసులు అరెస్టు చేశారు.
రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రతినిధులను,ఢిల్లీలో వివిధ చోట్ల బస చేసిన మావోయిస్టులను సభాస్ధలికిచేరకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులచర్యలను మావోయిస్టు నాయకులు, విరసంసభ్యులు తీవ్రంగా విమర్శించారు. తాముప్రజాస్వామ్య బద్ధంగా సభ జరుపుకుంటామంటే నిరాకరించడందారుణమని, ఇది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేననివారు పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు.
అరెస్టయినవారిలోఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిపి ఐ(మావోయిస్టు) ప్రతినిధి, విప్లవ కవివరవరరావు ఉన్నారు. దాదాపు ఏడువందల మందిని పోలీసులు అదుపులోకితీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రంఐదు గంటలకు వారిని వదిలేశారు. సభకుఅనుమతి ఇవ్వకపోవడాన్నివరవరరావు తీవ్రంగావిమర్శించారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం నక్సలైట్లతోజరుపుతున్న చర్చలకు అడ్డంకి కావనిఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
