సమస్యపరిష్కారమయ్యే వరకు చర్చలు: జానా
హైదరాబాద్:సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేవరకు నక్సలైట్లతో చర్చలుజరుగుతాయని హోం మంత్రి కె. జానారెడ్డిచెప్పారు. నక్సల్స్ సమస్యపై మర్రిశశిధర్ రెడ్డి నేతృత్వంలోఏర్పాటయిన టాస్క్‌ఫోర్స్ ఆదివారం రాష్ట్రప్రభుత్వంతో సమావేశమైంది. ఈసందర్భంగా జానారెడ్డి విలేకరులతోమాట్లాడారు.
రాష్ట్రంలోశాంతిభద్రతల సమస్యకు శాశ్వతపరిష్కారం లభించేవరకు నక్సలైట్లతోచర్చలు కొనసాగుతాయని ఆయనచెప్పారు. నక్సలిజం మూలాలను, అందుకుకారణమైన సాంఘిక, ఆర్థిక, ప్రాంతీయసమస్యలను టాస్క్‌ఫోర్స్ అధ్యయనంచేస్తుందని ఆయన చెప్పారు.దేశంలోనినక్సల్స్ సమస్య పరిష్కారానికి తగినసూచనలు సూచించడమే తమలక్ష్యమని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ మర్రిశశిధర్ రెడ్డి చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోచర్చించడం ద్వారా తమ పనినిప్రారంభించామని ఆయన చెప్పారు.నక్సల్స్ సమస్య పరిష్కారానికి వివిధరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నచర్యలను అధ్యయనం చేసి, తగినసూచనలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు, కాంగ్రెస్ నాయకత్వానికిచేయడమే తమ కర్తవ్యమనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
