సహచరుడికాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి
శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్‌లోని పారామిలటరీ బలగానికిచెందిన ఒక పైనికుడు జరిపిన కాల్పులలోఅతని సహచరులు ఏడుగురుమరణించారు. మరో ఇద్దరు తీవ్రంగాగాయపడ్డారు. ఈ సంఘటన శ్రీనగర్‌కుయాబై నాలుగు కిలోమీటర్ల దూరంలో గలబారాముల్లాలో శనివారం రాత్రిజరిగింది.
గతపదిహేనేళ్లుగా ఇటువంటి సంఘటనజరగలేదు. ఈ సంఘటనతో కేంద్రసాయుధ పోలీసు బలగాల అధికారుల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులుజరిపి తన సహచరులను కాల్చిచంపిన సైనికుడు తాను కాల్చుకునిఆత్మహత్య చేసుకున్నాడు.బారాముల్లాలోని కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోవిధులు నిర్వహిస్తున్న ఆ సి ఆర్‌పియఫ్‌జవాను శనివారం అర్థరాత్రివిచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.గార్డులు అప్రమత్తమయ్యే లోగానేఏడుగురు మరణించారు.మరణించినవారు ఇన్‌స్పెక్టర్ స్థాయికంపెనీ కమాండర్, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.











Click it and Unblock the Notifications
