మేంచెప్పిందే అవుతోంది, అవుతుంది: కెసిఆర్
హైదరాబాద్:మొదటి నుంచి తాము చెప్పుతున్నదేజరుగుతున్నదని తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్‌యస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలోనారా చంద్రబాబునాయుడి పార్టీభూస్థాపితమవుతుందని చెప్పామని,అది జరిగిందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూకాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయనిచెప్పామని, అదే జరిగిందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోనూతాము చెప్పిందే జరుగుతుందనిఆయన అన్నారు.
తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు తాము డెడ్‌లైన్‌ఎప్పుడూ పెట్టలేదని, తాముసాధ్యమవుతుందని అనుకున్నసమయాలను మాత్రమే చెప్పామని,ఇప్పుడు మార్చి లోగా తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని ఆశిస్తున్నామని ఆయనఅన్నారు. కేంద్రం వేసిన కమిటీవిస్తృత ప్రాతిపదికపై తెలంగాణ మీదఏకాభిప్రాయం సాధించడానికేనని, బిల్లుప్రవేశపెట్టడానికి అవసరమైనకసరత్తును ఆ కమిటీ చేస్తుందనిఆయన చెప్పారు. అందరి సాక్షిగానేతెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అదిఅనివార్యమని ఆయన అన్నారు.తెలంగాణఏర్పాటు విషయంలో కొంత మందివక్రభాష్యాలు చెబుతున్నారని, వారిమూర్ఖత్వానికి జాలి పడడం తప్ప ఏమీచేయలేమని ఆయన చెప్పారు. కమిటీవల్ల రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందనేతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుచంద్రబాబు అభిప్రాయాన్ని ఆయన ఎద్దేవాచేశారు. చంద్రబాబు పార్టీ విషయంలో అనిశ్చితిఏర్పడుతుందని, రాజకీయ అనిశ్చితిఏర్పడదని ఆయన అన్నారు.వచ్చేనెల పదకొండవ తేదీనహైదరాబాద్‌లో ర్యాలీ, అనంతరంబహిరంగ సభ నిర్వహించనున్నట్లుఆయన తెలిపారు. హైదరబాద్‌లోనిపెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభకు ఐక్య ప్రగతిశీల కమిటీ (యుపిఎ)నాయకులు కూడా పాల్గొంటారని ఆయనచెప్పారు. అదే రోజు పార్టీ కార్యాలయంశంకుస్థాపన జరుగుతుందని ఆయనచెప్పారు. ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు ఆమోదం కూడా పొందామనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
