జయేంద్రబెయిల్‌కు సుప్రీంకు వెళ్లం:న్యాయవాదులు
వెల్లూర్/కాంచీపురం:బెయిల్ కోసం ప్రస్తుతంసుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదనిశంకరరామన్ హత్య కేసులోఅరెస్టయిన కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి తరఫున్యాయవాదులు చెప్పారు. న్యాయవాదులుకె.యస్. దినకర్, ఐ. సుబ్రహ్మణ్యం, ఎ.అరుణ్ ఆదివారంనాడు వెల్లూరు జైలులోశంకరాచార్యతోసమావేశమయ్యారు. వారు ఆయనతోగంటకు పైగా ఉన్నారు.
రెండుకేసుల్లో తాము మద్రాసు హైకోర్టులో,చెన్నై సెషన్స్ కోర్టులో దాఖలు చేసినబెయిల్ పిటిషన్లపై వారు ఆయనకుతెలియజేశారు. ఈ రెండు పిటిషన్లుకూడా సోమవారం విచారణకురానున్నాయి. శంకరాచార్య ఆరోగ్యంమెరుగ్గా ఉందని వారు చెప్పారు.శంకరరామన్‌హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తుబృందం ఆదివారంనాడు కాంచీపురంలోశంకరరామన్ భార్యను,కూతురును ప్రశ్నించారు. ఈ కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టయిన విషయం తెలిసిందే.దర్యాప్తును సమన్వయం చేస్తున్నకాంచీపురం పోలీసు సూపరింటిండెంట్‌కూడా ఈ సందర్భంగా ఉన్నారు. దర్యాప్తుబృందంలో మహిళా పోలీసులు కూడాఉన్నారు.











Click it and Unblock the Notifications
