అభివృద్ధికిబాట వేసే బడ్జెట్: వైయస్
హైదరాబాద్:రాష్ట్ర అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చేదిగాఆర్థిక మంత్రి కె. రోశయ్య ప్రతిపాదించినబడ్జెట్‌ను ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిఅభివర్ణించారు. ఎన్నికల వాగ్దానాలనునిలబెట్టుకు దిశలో బడ్జెట్ ప్రతిపాదనఉన్నదని ఆయన విలేకరులతో అన్నారు.అన్ని రంగాలకు కేటాయింపులు అందుకుఅనుగుణంగానే ఉన్నాయని ఆయన అన్నారు.ఉపాధి అవకాశాలు గణనీయంగాపెరుగుతాయని ఆయన అన్నారు.
సాగునీటికిపెద్ద యెత్తున కేటాయింపుల జరిపామనిఆయన చెప్పారు. 2003-04 బడ్జెట్‌లోతెలుగుదేశం ప్రభుత్వం సాగు నీటిప్రాజెక్టులకు 2000 కోట్లు కేటాయిస్తే తాము ఈఆర్థిక సంవత్సరం 2005-06లో రూ.6400 కోట్లుకేటాయించామని ఆయన చెప్పారు. ఎస్‌సి,ఎస్‌టిలకు, బీసి సంక్షేమానికి, వైద్యఆరోగ్య రంగానికి నిధులు పెంచామనిఆయన చెప్పారు.
తాముప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలుచేస్తామని ఆయన చెప్పారు. ప్రజలుతమకు ఐదేళ్ల కోసం అధికారంఇచ్చారని, తాము చేసిన వాగ్దానాలనుదశలవారీగా ఐదేళ్లలో పూర్తి చేస్తామని,చెప్పినదాని కన్నా ఎక్కువే చేస్తామనిఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications