రాష్ట్రబడ్జెట్ అంకెల గారడీ: సిపియం
హైదరాబాద్:ఆర్థిక మంత్రి కె. రోశయ్య శుక్రవారంశాసనసభలో ప్రతిపాదించిన బడ్జెట్‌నుఅంకెల గారడీగా కాంగ్రెస్ మిత్రపక్షంసిపియం విమర్శించింది. బడ్జెట్ ప్రజలమనోభావాలకు అద్దం పట్టేదిగా లేదనిసిపియం శాసనసభా పక్ష నాయకుడునోముల నరసింహయ్య విలేకరులతోఅన్నారు. ద్రవ్యలోటును ఏ విధంగాతగ్గిస్తారో చెప్పలేదని ఆయనవిమర్శించారు. బడ్జెట్‌లో భూసంస్కరణలప్రస్తావన లేదని ఆయన చెప్పారు.సంక్షేమంపై కూడా ప్రభుత్వానికిదృష్టి లేదని బడ్జెట్‌తెలియజేస్తోందని ఆయన అన్నారు.
చేనేతకార్మికుల సంక్షేమానికి తప్ప మిగతావృత్తిపనివారి కోసం బడ్జెట్‌లో ఏమీప్రతిపాదించలేదని ఆయన అన్నారు. జనాభాలోసగభాగం ఉన్న వెనకబడినతరగతులకు బడ్జెట్‌లో సగభాగంకేటాయించాలని, అయితే బిసిలకునామమాత్రమే కేటాయింపులు జరిపారనిఆయన అన్నారు. కుడిచేత్తో ఇచ్చి ఎడమచెత్తో తీసుకున్నట్టు బడ్జెట్ ఉన్నదనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications