తెలంగాణరాష్ట్రానికి ఇదే సమయం: టిడియఫ్‌

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమయంఆసన్నమైందని, ఈ విషయాన్ని సానుభూతితోఅర్థం చేసుకుని తెలంగాణా రాష్ట్రఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించాలనిఅమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్‌ఫోరమ్‌ (టిడియఫ్‌) తెలంగాణపైఏర్పాటయిన ప్రణబ్‌ ముఖర్జీనేతృత్వంలోని ఉపసంఘానికి విజ్ఞప్తిచేసింది. తెలంగాణ ఏర్పాటు మీ చేతుల్లోనేఉన్నదని ఫోరమ్‌ ఉపసంఘాన్ని ఉద్దేశించిఅన్నది. ఈ మేరకు టిడియఫ్‌ ఒక విజ్ఞప్తిపత్రాన్ని ఉపసంఘానికి సమర్పించింది. ఈవిషయాన్ని ఫోరమ్‌ అధ్యక్షుడు మధుకె. రెడ్డి ఒక ప్రకటనలోతెలియజేశారు.

స్వయంసమృద్ధి సాధించడానికి అవసరమైనవనరులు తెలంగాణలో ఉన్నాయని,రాష్ట్రంగా ఏర్పడిన కొద్ది కాలంలోనేతెలంగాణా ఎంతో అభివృద్ధి చెందగలదనిఆయన అన్నారు. 2 లక్షల మందికి పైగాతెలంగాణకు చెందిన ప్రవాసభారతీయులు తెలంగాణ అభివృద్ధికినిరంతరం కృషి చేస్తారని ఆయనహామీ ఇచ్చారు. ఇరు ప్రాంతాల పరస్పరద్వేషంతో కాకుండాసామరస్యపూర్వకంగా తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయనఉపసంఘాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడకపోతే ఇథియోపియాగా మారిపోయేప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు.దేశంలో తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాలుపదిహేను ఉన్నాయని, ఈ లెక్కన చూసినాతెలంగాణ రాష్ట్రం ఏర్పాటుసమంజసమేనని ఆయన అన్నారు.

తెలంగాణవనరులను, ఉద్యోగాలను వనరులనుఆంధ్ర ప్రాంతంవారుకొల్లగొడుతున్నారని, అసెంబ్లీలో మెజారిటీగాఉన్న ఆ ప్రాంతంవారు తెలంగాణకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తున్నారని ఆయనఅన్నారు. వెనకబడిన తెలంగాణఅభివృద్ధికి ఇచ్చిన హామీలు, కల్పించినభద్రతలు ఏ రోజు కూడా అమలు కాలేదనిఆయన అన్నారు.

తెలంగాణప్రజలు తమ సొంత గడ్డమీదనే ద్వితీయశ్రేణి పౌరులుగా బతుకుతున్నారని,గత ఐదు వందల యాభైసంవత్సరాలుగా తెలంగాణ ప్రజలుఅణచివేతకు గురవుతున్నారనిఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుఅవసరాన్ని గుర్తించడానికి చరిత్రవిద్యార్థో, తెలంగానవాసియోకానక్కర్లేదని, విశాల దృక్పథంగలవారైతే చాలునని ఆయన అన్నారు. భాషఒక్కటే ప్రాతిపదిక అయితే హిందీ భాషమాట్లాడే ప్రాంతాలకు తొమ్మిది రాష్ట్రాలకుఅవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+