బెనజీర్ లక్ష్యంగా పేలుళ్లు: 164 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) బెనజీర్ భుట్టో లక్ష్యంగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన జంట పేలుళ్లలో 164 మరణించారు. 50 0మందికి పైగా గాయపడ్డారు. ఎనిమిదేళ్ల తర్వాత పాకిస్థాన్‌లో ఆమె అడుగుపెట్టిన కొద్ది గంటల్లోపే ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడి నుంచి తృటిలో తప్పుకున్న బెనజీర్‌ను కరాజీలోని ఆమె నివాసమైన బిలావాల్ హౌస్‌కు సురక్షితంగా తరలించామని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తెలిపారు. ర్యాలీ అనంతరం జరగాల్సిన బహిరంగ సభను ఆమె రద్దు చేసుకున్నారు.
బెనజీర్ భుట్లో కాన్వాయ్ కి కొద్ది అడుగుల దూరంలోనే ఈ పేలుళ్లు సంభవించాయి. మృతుల్లో ఎక్కువగా పోలీసులు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తలే ఉన్నారు. కరాచీలోని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ పేలుళ్లు మానవ బాంబుల కారణంగానే చోటు చేసుకున్నాయని వెల్లడించారు. దాడులు ఆల్ ఖైదా పనేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications