చంద్రబాబే ఆ దయ్యం: కన్నా
హైదరాబాద్: లక్ష రూపాయల కోసం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రైతు సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని రవాణా శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం శాసనసభలో చంద్రబాబు నాయుడు వరికి మద్ధతు ధరకు సంబంధించి మాట్లాడటంతో ప్రతిగా ప్రభుత్వం తరఫున కన్నా మాట్లాడుతూ అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు రైతులు గుర్తుకు వస్తున్నారని దుయ్యబట్టాడు.
దయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే కాబోలు అంటూ ఆ దయ్యం చెంద్రబాబేనని ఘాటుగా విమర్శించారు. దీనికి తీవ్రంగా స్పందించిన తెలుగుదేశం శాసనసభ్యులు కన్నా ప్రసంగానికి అడ్డుతగిలారు. వ్యక్తి గత దూషణలకు మంత్రి పాల్పడడం సబబు కాదంటూ గొడవకు దిగారు. విపక్ష నాయకులు కల్పించుకని ఇది మంచి సంప్రదాయం కాదని ఇరువర్గాలకు సర్ధిచెప్పాలని స్పీకర్ ను కోరారు. సభకు భూతం పట్టిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాను మాట్లాడుతున్నది వ్యక్తి గత విమర్శ కాదని కన్నా మళ్లీ తిరిగి మాట్లాడుతుండగా తెలుగుదేశం వారు మళ్లీ మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ సందర్భంలోనే ప్యానల్ స్పీకర్ కుతూహలమ్మ సభను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
