విజయవాడ ఎన్నారై ఇంట్లో దోపిడీ
విజయవాడ: విజయవాడ సమీపంలోని పెనుములూరు సెంటర్లో ఉన్న ఒక ప్రవాస భారతీయుడి (ఎన్నారై) ఇంట్లో శుక్రవారం పట్టపగలు దోపిడీ జరిగింది. ఇంట్లో ఉన్నవారిని వంటగదిలో బంధించి దోచుకెళ్లారు. ముసుగులు ధరించిన కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఇద్దరు ముసలివాళ్లను, ఒక పిల్లవాడిని కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు.
దొంగలు 15 లక్షల రూపాయల నగదు, 10 సవర్ల బంగారం దోచుకెళ్లనట్లు అంచనా. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. రెండు ప్రత్యేక పోలీసు బృందాలు దొంగల కోసం వేట ప్రారంభించారు. ఇటీవల గొల్లపూడిలో కూడా ఇటువంటి దోపిడే జరిగింది. అప్పుడు దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిని తాపీగా దోపిడీ చేశారు.












Click it and Unblock the Notifications
