వైయస్ ప్రాంతీయ ద్వేషాలు: టిడిపిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు విమర్శించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విమర్శ చేశారు. సమస్యలను ముఖ్యమంత్రి జటిలం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి పరిష్కరించిన సమస్యలేవీ లేవని, సమస్యలను జటిలం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భూస్థాపితం చేస్తుందో, తెరాసను కాంగ్రెసును భూస్థాపితం చేస్తుందో తెలియదు గానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications