అట్లాంటాలో కొత్త సాఫ్ట్‌వేర్ సెంటర్: విప్రో ప్రేమ్‌జీ

ఆయన అట్లాంటా బిజినెస్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా అమెరికాలో ఐటీ నిపుణుల కొరత రోజురోజుకు పెరుగుతోందని, దీనిని అక్కడి కంపెనీలు తీవ్రంగా పరిగణించి సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అమెరికా వీసాలపై విధించిన గరిష్ఠ పరిమితి ఆ దేశ పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రేమ్‌జీ అన్నారు. ఐటీ రంగంలోని ఉద్యోగాలన్నీ ఇండియా లాంటి దేశాలకు తరలిపోతున్న మాట వాస్తవమే అయినప్పటికీ వ్యాపారపరంగా అది చివరికి అమెరికాకే ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications