జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!
ఏపీలో తాజాగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన పులివెందుల ( Pulivendula) మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో కూటమికీ ఇవి ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ముందు నుంచే పక్కాగా ప్లాన్ చేసిన టీడీపీ (TDP) .. ఎక్కడా వైసీపీకి అవకాశం ఇవ్వకుండా పులివెందులను తమ ఖాతాలో వేసేసుకుంది. ఇవాళ ఓట్ల లెక్కింపు తర్వాత పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ సీటుతో పాటు వార్డుల్నీ ఏకపక్షంగా టీడీపీ కైవసం చేసుకుంది.
పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 20 వార్డుల్ని ముందుుగానే టీడీపీ ఏకగ్రీవం చేసేసుకుంది. ఇక మిగిలిన 20 వార్డులతో పాటు పులివెందుల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికీ ఎన్నికలు జరిగాయి. దీంతో పోలింగ్ రోజు స్ధానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్, స్ధానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా అక్కడే పాగా వేశారు. అయినా పోలీసుల సహకారంతో వైసీపీ ఏజెంట్లను బూత్ లలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ.. ఎన్నికల్ని ఏకపక్షంగా మార్చుకుంది.

దీంతో ఇవాళ నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్ధి గీతా కుమారి తన ప్రత్యర్ధి అయిన వైసీపీ అభ్యర్ది వైఎస్ ప్రమీలపై ఏకంగా 13, 875 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఏకగ్రీవం అయిన వార్డులతో కలిపి టీడీపీ 34 వార్డుల్ని గెల్చుకుంది. బీజేపీ రెండు వార్డుల్ని దక్కించుకుంది. జనసేన ఒక వార్డులో గెలుపొందింది. వైఎస్సార్సీపీ కేవలం 3 వార్డులకే పరిమితమైంది. దీంతో టీడీపీ పులివెందుల మున్సిపాలిటీతో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవీని చేజిక్కించుకున్నట్లయింది. ఈ గెలుపుతో గతంలో వైసీపీ హయాంలో పట్టుబట్టి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీని జగన్ దక్కించుకున్న తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు పులివెందులను గెల్చుకున్నారు. తద్వారా జగన్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.













Click it and Unblock the Notifications
