మున్సిపల్ ఫలితాల పై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్, ఇక నుంచి..!!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల పై సీఎం చంద్రబాబు స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఏకపక్షంగా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మెజార్టీ సీట్లలో విజయం సాధించి.. భారీ మెజార్టీలు దక్కించుకుంది. అటు మురుసు తుఫాను కారణంగా కొన్ని చోట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. కాగా.. ఈ ఫలితాల పైన సీఎం చంద్రబాబు స్పందించారు. తుఫాను పైనా సమీక్ష చేసారు. ఫలితాల పైన చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

వచ్చే ఆరు గంటలు కీలకం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
వచ్చే ఆరు గంటలు కీలకం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల పైన స్పందించిన సీఎం చంద్రబాబు.. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. సాయంత్రానికి మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు. తాము చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. ఇదే తన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. రాజకీయమా.. ప్రజల సమస్యల పరిష్కారమా అంటే తాను సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తాననని చెప్పారు.

నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!
నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!
CM Chandra Babu made interesting comments over Municipal Elections results directions for party leaders

మూడు రోజుల పాటు తాను తుఫాన్ సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశానని వివరించారు. అనునిత్యం ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు పనిచేశాం.. దీన్ని చూసే ప్రజలు ఓటేశారని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వెలిగొండ ద్వారా నీటిని అందించామని చంద్రబాబు వివరించారు.

అదే విధంగా అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. గతంలో రోడ్లను ధ్వంసం చేశారని... తాము రోడ్లేశామన్నారు. అన్ని పనులు చేసేశామని చెప్పడం లేదు.. వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా ఉన్నాయని వివరించారు. ప్రజలు ఇదే విధంగా కూటమిని ఆశీర్వదించాలి... సహకరించాలని కోరారు. మంచి పాలన అందిస్తున్నాం కాబట్టే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీ యత ఉందని చెప్పారు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ప్రజలకు సేవలందించే విషయంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దు కొంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి... ప్రజలకు ఇబ్బందులను దూరం చేసేలా పాలన అందిస్తున్నామని చెప్పారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, అధికార పార్టీకి ఓటేయని వారుంటారన్నారు. లబ్దిపొందే వాళ్లు కూడా ఎగతాళి చేసే వారు ఉంటారని చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఉన్నా వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+