యాక్టివా కంటే అదిరిపోయే లుక్.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 385 కి.మీ ప్రయాణం!

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'హోండా' అడ్వెంచర్ స్కూటర్ల విభాగంలో మరో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇటలీలోని మిలాన్ నగరం వేదికగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక 'ఈఐసీఎంఏ 2026' మోటార్ షోలో తన పవర్‌ఫుల్ స్కూటర్ 'హోండా ఏడీవీ 125'ను అధికారికంగా ఆవిష్కరించింది. రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ శైలి బాడీ డిజైన్, మస్కులర్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో వస్తున్న ఈ స్కూటర్, ప్రముఖ యాక్టివా సెగ్మెంట్‌కు కూడా ఓ సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

స్త్రీనిది ద్వారా మహిళలకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు.. ఇక దూసుకుపొండి!
స్త్రీనిది ద్వారా మహిళలకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు.. ఇక దూసుకుపొండి!

90 కిలోమీటర్ల వేగంగా దర్జాగా క్రూజింగ్!
హోండా ఏడీవీ 125 స్కూటర్లో 125 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 12.5 పీఎస్ పవర్, 11.7Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.య వేగవంతమైన పికప్ అందించే ఈ స్కూటరుపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో సునాయాసంగా, ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 97 కిలోమీటర్లుగా కంపెనీ ధ్రువీకరించింది. పనితీరులోనే కాకుండా ఇంధన పొదుపులోనూ ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఇది లీటరుకు 47.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని హోండా పేర్కొంది. ఇందులో 8.1 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ అమర్చడం వల్ల ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే దాదాపు 385 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం నాన్‌స్టాప్‌గా ప్రయాణించవచ్చు.

Honda ADV 125 Scooter Unveiled EICMA 2026 Entry With 385 km Range Features SUV styling 125cc liquid-cooled engine

ఎస్‌యూవీని తలపించే రగ్గడ్ డిజైన్
రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షించేలా హోండా ఏడీవీ 125 డిజైన్‌ను మలిచారు. అగ్రెసివ్ డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, ఆకర్షణీయమైన డీఆర్ఎల్స్, సర్దుబాటు చేయడానికి వీలున్న పెద్ద విండ్‌స్క్రీన్, ఎత్తుగా ఉండే సీటింగ్ పొజిషన్, కాస్త పైకి లేచిన స్పోర్టీ ఎగ్జాస్ట్ పైప్ దీనికి అడ్వెంచర్ లుక్‌ను తెచ్చిపెట్టాయి.

ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!
ఇకపై కార్లు తనంతట తావే బ్రేక్ వేసుకుంటాయి.. కేంద్రం సంచలన గెజిట్!

ఈ స్కూటరును స్టీల్ ట్యూబులర్ అండర్‌బోన్ ఫ్రేమ్‌పై దృఢంగా నిర్మించారు. ఆఫ్-రోడింగ్, రోజువారీ సిటీ రైడింగ్ రెండింటికీ అనువుగా ముందు భాగంలో 14-అంగుళాల వీల్స్, వెనుక భాగంలో 13-అంగుళాల వీల్స్‌ను అందించారు. ప్రయాణీకుల అత్యవసర బ్రేకింగ్ భద్రత కోసం సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ను ప్రామాణికంగా ఇస్తున్నారు.

రంగుల ఎంపిక
ఈ స్కూటర్ నాలుగు విభిన్నమైన ప్రీమియం షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. పర్ల్ ఫాల్కన్ గ్రే, పర్ల్ కూల్ వైట్, మ్యాట్ సైన్స్ గ్రే మెటాలిక్, మ్యాట్ పర్ల్ డియాస్ప్రో రెడ్ రంగులలో ఈ స్కూటర్ లభించనుంది.

అధునాతన స్మార్ట్ ఫీచర్లు, కనెక్టివిటీ
సాంకేతికపరంగా ఈ స్కూటర్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.

*5-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే: స్కూటర్ స్పీడ్, గేర్ పొజిషన్, ఫ్యూయల్ లెవెల్ వంటి వివరాలను స్పష్టంగా చూపిస్తుంది.

*హోండా రోడ్‌సింక్: స్మార్ట్‌ఫోన్‌ను స్కూటరుతో జత చేసుకోవడం ద్వారా నావిగేషన్, ఫోన్ మెసేజ్‌లు , కాల్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్స్‌ను డిస్‌ప్లే పైనే యాక్సెస్ చేయవచ్చు.

*హోండా స్మార్ట్ కీ: తాళం చెవి అవసరం లేకుండానే ఇంజిన్ ఆన్/ఆఫ్ చేయడం, స్మార్ట్ అన్‌లాకింగ్, ఫ్యూయల్ క్యాప్, సీట్ ఓపెనింగ్ సదుపాయాలు పొందుపరిచారు.

*భద్రత, ఛార్జింగ్: దొంగతనాల నివారణకు 'యాంటీ థెఫ్ట్ అలారమ్' వాహనం ఎక్కడుందో గుర్తుపట్టే 'ఆన్సర్-బ్యాక్ ఫీచర్'తో పాటు మొబైల్ అత్యవసర ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా ఇందులో అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+