రాజకీయం వద్దు: చిరంజీవికి సలహా
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి ప్రత్యేక అర్థిక మండలి (సెజ్) పర్యటన అర్థరహితమని కాంగ్రెస్ శాసనసభ్యుడు మల్లు రవి అన్నారు. పోలేపల్లి సెజ్ బాధితులను చిరంజీవి పరామర్శించాల్సిన అవసరం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సెజ్ బాధితుల పునరావాసం కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, రాజకీయం చేయవద్దని ఆయన చిరంజీవికి సూచించారు. ప్రజలను రెచ్చగొట్టడం భావ్యం కాదని ఆయన అన్నారు.
పోలేపల్లి సెజ్ బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వం సెజ్ బాధితులను ఆదుకుంటోందని ఆయన చెప్పారు. సెజ్ బాధితులకు భూమికి భూమి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సెజ్ బాధితుల వెనక కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications