బాలకృష్ణ తొడనే కొడ్తారు: డిఎస్

D Srinivas
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావుపై గౌరవంతో ప్రజలు గుంటూరు తెలుగుదేశం యువగర్జన సదస్సుకు వచ్చారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని తిరిగి అధికారంలోకి తేవడానికి రాలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, మనవళ్లు తారకరత్న, కళ్యాణ్ రామ్ వచ్చారు కాబట్టి గౌరవభావంతో మాత్రమే ప్రజలు సదస్సుకు వచ్చారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సదస్సుకు వచ్చిన ప్రజల్లో రాజకీయ ఆలోచనలు గానీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన గానీ లేవని ఆయన అన్నారు.

ప్రజలు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను చూశారని, ఆ పాలనను చూశాక మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకోరని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని ఆయన అన్నారు. ఉచిత కరెంట్ వంటి పలు సంక్షేమ పథకాలను రద్దు చేసిన చంద్రబాబు హామీలు ఇస్తే ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు. నందమూరి హీరోలు చంద్రబాబు చేతిలో పావులని ఆయన వ్యాఖ్యానించారు. తమ తండ్రి, తాత ఎన్టీఆర్ పై మమకారంతో కుమారులు, మనవళ్లు వచ్చారని, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలని వచ్చారని ఆయన అన్నారు. బాలకృష్ణ తొడ కొట్టకపోతే ఏం కొడతాడు, రోజు చేసే పని అదే ఆయన వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, చిరంజీవి తమ పార్టీని ఏం చేయలేరని ఆయన అన్నారు. సోనియా గాంధీ సభలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని, తెలంగాణలో కూడా సోనియా పర్యటిస్తారని ఆయన అన్నారు.

తాము పార్టీ చేస్తున్న కార్యక్రమాలపైనే ప్రజల్లోకి వెళ్తున్నామని, సినీ గ్లామర్ పై ఆధారపడి లేమని ఆయన అన్నారు. రెండు పార్టీల్లో సినీ తారలు ఉంటే తమ వెంట సినీ రంగానికి చెందిన పెద్ద సెక్షన్ ఉందని ఆయన చెప్పారు. యువగర్జన సదస్సు అంతా బావ, బావమరదుల డబ్బా అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా నటులు కూడా తమతో పని చేస్తున్నారని, తమది ప్రజల పార్టీ అని, అన్ని రంగాలవారు ఉంటారని ఆయన అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ బలహీనపడిందని, దాన్ని నిలబెట్టాలని వచ్చామని బాలకృష్ణ చెప్పారని, కన్న పిల్లలకు ఆ మాత్రం బాధ ఉండడం సహజమని ఆయన అన్నారు. బాలయ్య ముఖ్యమంత్రి అని అంటూనే వున్నారని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. గర్జన గిర్జనలతో సంబంధమేమీ లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+