వెంకీ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ వచ్చేసింది

విక్టరీ వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో అంటే 2001 లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, 2004లో వచ్చిన మల్లీశ్వరి సినిమాలే గుర్తుకువస్తాయి. ఈ రెండు సినిమాలు కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లుగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం'ఆదర్శ కుటుంబం' ఈ మూవీ వెంకటేశ్ సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Venkatesh and Trivikram s Adarsha Kutumbam Set for Grand Release on October 2nd Adarsha Kutumbam

అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఆదర్శ కుటుంబం ఇంటి తలుపులు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు తెరుచుకుంటాయని.. ప్రతి ఫ్యామిలీ ఈ డేట్ ను గుర్తు పెట్టుకోవాలని సామాజిక మాధ్యమాల్లో చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అక్టోబర్ 2 న దసరా సీజన్ వేళ ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీలో వెంకటేశ్ ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా అలరించనున్నారు.

ఇక గతేడాది సంక్రాంతికి వస్తున్నాం.. చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు విక్టరీ వెంకటేశ్. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఐదో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇలా ఏడాదికి రెండు సినిమాలతో విక్టరీ వెంకటేశ్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+