vastu tips: ఇంటిపై వాటర్ ట్యాంక్ ఏ దిశలో ఉండాలి?
ఇంటిని నిర్మించేటప్పుడు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ క్రమంలోనే నైరుతి దిక్కులో బరువు ఉండాలనే నియమాన్ని మనసులో పెట్టుకుని, చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు.. ఇంటిపై వాటర్ ట్యాంకును నైరుతి మూలలో నిర్మించడం. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈ ఒక్క పొరపాటు వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అశాంతి తలెత్తే అవకాశం ఉంది. మరి వాటర్ ట్యాంక్ విషయంలో అసలైన వాస్తు నియమం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాస్తు సిద్ధాంతం ప్రకారం నైరుతి భాగం ఎప్పుడూ ఎత్తుగా, బరువుగా ఉండాలి అనేది నిజమే. అయితే, అదే సమయంలో నైరుతి అనేది 'పృథ్వీ తత్వం' (భూమి) కు సంబంధించినది. నీరు 'జల తత్వం' కిందికి వస్తుంది. భూమి స్థానంలో జలాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. నైరుతిలో బరువు ఉండాలి, కానీ అక్కడ నీళ్లు నిల్వ ఉండకూడదు.

వాటర్ ట్యాంకుకు సరైన దిక్కు ఏది?
ఇంటి పైన ట్యాంకు కట్టుకునేటప్పుడు ఏ దిక్కున నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయో వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పడమర మధ్య భాగం ఇంటి పైకప్పు మీద పడమర దిక్కుకు మధ్యలో వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఇది ఇంటికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ పడమర కుదరకపోతే, ఉత్తరం వైపు మధ్య భాగంలో కూడా ట్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి పైన ఉండే ట్యాంకుకు, భూమి లోపల ఉండే అండర్ గ్రౌండ్ ట్యాంకు (సంప్) కు చాలా తేడా ఉంటుంది. భూమి లోపల నీటిని నిల్వ చేయడానికి ఈశాన్యం లేదా తూర్పు దిక్కులు మాత్రమే ఉత్తమమైనవి. పొరపాటున కూడా భూగర్భ ట్యాంకును నైరుతిలో తవ్వకూడదు.
ట్యాంకు కింద గ్యాప్ ఉండాలి (స్లాబ్‌ను తాకకూడదు)
వాటర్ ట్యాంకును నేరుగా ఇంటి స్లాబ్ (పైకప్పు) మీద పెట్టకూడదు. స్లాబ్‌కు, ట్యాంకు అడుగు భాగానికి మధ్య కనీసం ఒకటి లేదా రెండు అడుగుల గ్యాప్ ఉండేలా ఇటుకలు లేదా కాంక్రీట్ పిల్లర్లతో ఒక చిన్న ప్లాట్‌ఫారమ్ (అరుగు) నిర్మించి, దానిపై ట్యాంకును ఉంచాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ నేరుగా ఇంట్లోకి ప్రసరించదు.ఇల్లు కట్టేటప్పుడు కేవలం 'బరువు' అనే లాజిక్‌ను మాత్రమే చూసి నైరుతిలో నీటి ట్యాంకులు పెట్టే ప్రయోగాలు చేయకండి. జల తత్వానికి, పృథ్వీ తత్వానికి ఉన్న తేడాలను గమనించి.. పడమర లేదా ఉత్తరం మధ్య భాగాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.














Click it and Unblock the Notifications